అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా.. (Athyunnatha Simhaasanamupai) - Bro.Yesanna by Asher's SongsBin 01 published on 2012-06-05T09:36:04Z అత్యున్నత సింహాసనముపై - ఆసీనుడా దేవదూతలు ఆరాధించు - పరిశుద్ధుడా యేసయ్యా - నా నిలువెల్లా నిండుయున్నావు నా మనసార నీ సన్నిధిలో.. సాగిలపడి నమస్కారమూ చేసెద - 2 1. ప్రతి వసంతమూ - నీ దయాకిరీటమే ప్రకృతి కళలన్నియూ -నీ మహిమను వివరించునే = 2 ప్రభువా నిన్నే ఆరాధించెద.. కృతజ్ఞతార్పణలతో - 2 2. పరిమళించునే - నా సాక్ష్యజీవితమే పరిశుద్ధాత్ముడు - నన్ను నడిపించుచున్నందునే = 2 పరిశుద్ధాత్మలో ఆనందించెద.. హర్ష ధ్వనులతో - 2 3. పక్షిరాజువై - నీ రెక్కలపై మోసితివే నీవే నా తండ్రివై - నా భాధ్యతలు భరించితివే = 2 యెహోవా నిన్నే మహిమపరచెద.. స్తుతిగీతాలతో - 2 Comment by 8074532178 praise the lord 2019-12-17T14:54:22Z Comment by smilly devastating Neeku sthothram 2015-09-03T20:59:37Z