ఫలములనాశించిన పరలోకతండ్రి ...(Phalamulanasinchina Paraloka Tandri).. by Asher's SongsBin 01 published on 2012-07-13T15:09:18Z సత్తువభూమిలో శ్రేష్టమైన ద్రాక్షతీగలను నాటించిన దేవుడు, నీవు ఫలిస్తే సంతోషిస్తాడు.. ఫలములనాశించిన పరలోకతండ్రి - తేరిచూచుచున్నాడు నీ వైపు - 2 ప్రేమతో నిను పెంచిన ప్రియ తోటమాలి - పరిక్షించుచున్నాడు నీ కాపు - 2 ఫలియించకుండుట నీకు న్యాయమా - యజమాని సహనముతో చెలగాటమా..? - 2 1. ఐగుప్తునుండి పెరికి తెచ్చినాడు - సంఘద్రాక్షతోటలో నిన్ను నాటినాడు - 2 చుట్టు త్రవ్వి ఎరువు వేసి - నీరుపోసినాడు - 2 తన స్వాస్థ్యముగా నిను - ప్రత్యేకపరచినాడు - 2 ఫలియించకుండుట నీకు న్యాయమా - యజమాని సహనముతో చెలగాటమా..? - 2 2. వెదకినపుడు నీ యొద్ద ఫలములేకయుంటే - ఆకులతో నిను చూసి తండ్రి సంతసించునా- 2 ఇవ్వబడిన సమయములో - వర్ధిల్లకుంటే - 2 మోడులాంటి నిన్ను ఇంక - నరికివేయకుండునా - 2 ఫలియించకుండుట నీకు న్యాయమా - యజమాని సహనముతో చెలగాటమా..? - 2