వరిలో జింక్ లోప నివారణ by RFIS-ADVISORIES published on 2023-03-01T14:33:33Z వరిలో జింక్ లోపం నాటిన 2-6 వారాల్లో ముదురాకు చివర్లో మధ్య ఈనేకు ఇరుప్రక్కల తుప్పు లేక ఇటుక రంగు మచ్చలు కనపడతాయి. ఆకులు చిన్నవిగా,పేలుసుగా ఉండి వంచగానే శబ్దం చేస్తూ విరిగిపోతాయి.మొక్కలు గిడసబారి దుబ్బు చేయవు. నివారణకు ఆఖరి దమ్ములో ఎకరానికి 20 కిలోల జింకు సల్ఫేట్ వేయాలి. పైరుపై పిచికారి చేసే రైతులు జింక్ సల్ఫెట్ 2 గ్రా లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారి చేసుకోవాలి.